The agitation of the people of the area who had given up their land to continue Amravati as the capital reached its 400th day on Wednesday.
#AndhraPradesh
#AmaravatiFarmers
#APFarmers
#APCMJagan
#APCapital
#AP3Capitals
#Amaravathi
ఏపీకి మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దు… నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భూములిచ్చిన ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న ఆందోళన బుధవారం నాటికి 400వ రోజులకు చేరుకుంది. రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమే తమ భూములిచ్చామని.. ఇప్పుడు రాజధానిని మారిస్తే.. తమకు న్యాయం జరగదంటూ.. ఆ ప్రాంత రైతులు, మహిళా రైతులు, రైతు సంఘాలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. నేటితో అమరావతి కోసం చేస్తున్న ఆందోళనలు నేటితో 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని గ్రామాల్లో రైతులు బైక్, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నారు.